ఏపీ ప్రభుత్వ సమగ్ర శిక్ష సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBVs) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1095 బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఉద్దేశించిన ఈ నియామకాలు పూర్తిగా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జరుగుతాయి. టెన్త్, డిగ్రీ,బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్, వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 20వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను అడిషనల్ ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్ ఆఫీసుల్లో అందజేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు:
రాష్ట్రంలోని టైప్-III , టైప్-IV కేజీబీవీల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు: 1095
విభాగాల వారిగా..
వార్డెన్-86
పార్ట్-టైమ్ టీచర్-122
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-134
ఏఎన్‌ఎం (ANM)-110
అసిస్టెంట్ కుక్- 259(Type III & IV కలిపి)
చౌకీదార్ / వాచ్‌మెన్- 121
ఇతర పోస్టులు (అకౌంటెంట్, అటెండర్, స్కావెంజర్ మొదలైనవి)
విద్యార్హతలు:
కుక్, అటెండర్, స్వీపర్, వాచ్‌మెన్ పోస్టులు: వీటికి ప్రత్యేకమైన చదువు అవసరం లేదు. చదవడం, రాయడం తెలిసి ఉంటే సరిపోతుంది.
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: ఇంటర్ లేదా డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సు (PGDCA వంటివి) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఏఎన్‌ఎం పోస్టులు: ఇంటర్, ఏఎన్‌ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
వార్డెన్ / టీచర్ పోస్టులు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ (B.Ed) పూర్తి చేసి ఉండాలి.
వయస్సు (01-07-2025 నాటికి): అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు 45 ఏళ్లు ఉండాలి.( ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు (50 ఏళ్ల వరకు), దివ్యాంగులకు 7 ఏళ్లు (52 ఏళ్ల వరకు) వయోసడలింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు:
చివరి తేదీ: అభ్యర్థులు జనవరి 11 వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
తాత్కాలిక మెరిట్ జాబితా :జనవరి 19 న తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
వాక్-ఇన్ ఇంటర్వ్యూలు: జనవరి 23, 24 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
అప్లికేషన్ విధానం: అర్హులైన మహిళా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్ అవసరమైన డాక్యుమెంట్స్ తో కలిపి మీ జిల్లాలోని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) ఆపీసులో ఇవ్వాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





