ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ఇంటర్ బోర్డ్ పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ రోజుతో గడువు ముగుస్తుండగా.. అక్టోబర్ 22 వరకు పొడిగించారు. ఇదిలా ఉంటే.. రూ. 1000 లేట్ ఫీజుతో ఈ నెల 3 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారు. అంతే కాకుండా ప్రాక్టికల్స్‌కు రూ.275, థియారీ పేపర్లు రూ. 600, బ్రిడ్జి కోర్సు సబ్జెక్టుకు రూ. 165 చొప్పున చెల్లించాలని సూచించారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషల్ ఉంటాయి.





