ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందని వారికి, ఇంత వరకూ.. కౌన్సెలింగ్‌లో పాల్గొనని వారికి మరో అవకాశం లభించింది. ఏపీ ఐసెట్-2026 చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపటి నుంచే (సెప్టెంబర్ 21).. ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అంతే కాకుండా ఇది ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఏయే తేదీల్లో.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి? వెబ్ ఆప్షన్లు..ఎప్పుడు మార్చుకోవాలి ? సీట్ల కేటాయింపు ఎప్పుడు ? వంటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో (సర్టిఫికెట్ వెరిఫికేషన్):
మొదటి విడతలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కాని వారు లేదా కొత్తగా అప్లై చేసుకున్న అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు తప్పని హాజరుకావాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 23 వరకు (రిజిస్ట్రేషన్ & అప్లికేషన్లు):
ఇంతకుముందు కౌన్సెలింగ్ ప్రక్రియలొ ఏ దశలోనూ పాల్గొనని వారు.. లేదా ఇప్పటి వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని.. అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
సెప్టెంబర్ 24 వరకు (వెబ్ ఆప్షన్ల మార్పు):
అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు , కోర్సులను ఎంచుకోవడానికి (వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి) అలాగే.. ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 24 వరకు గడువు ఇచ్చారు.
సెప్టెంబర్ 26న (సీట్ల కేటాయింపు):
అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 26న విడుదల చేస్తారు.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు (సెల్ఫ్ జాయినింగ్ & రిపోర్టింగ్):
చివరి విడతలో సీటు ఖారారైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ జాయినింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీలోపు కేటాయించిన సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసి అడ్మిషన్ పొందాలి.





