ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP ICET-2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జులై 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేరుకోవాలని ఉన్నత విద్యా మండలి (APSCHE) సూచించింది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభం: జులై 10, 2025.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జులై 14.
వెబ్ ఆప్షన్ల నమోదు: జులై 13 నుంచి జులై 16.
సీట్ల కేటాయింపు: జులై 19
కాలేజీల్లో రిపోర్టింగ్: జులై 20 నుంచి జులై 23.
కౌన్సెలింగ్ ప్రక్రియ:
రిజిస్ట్రేషన్ , ఫీజు చెల్లింపు: అర్హత పొందిన అభ్యర్థులు ముందుగా AP ICET అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ. 500 కాగా, ఇతరులకు రూ. 1000 గా నిర్ణయించారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత.. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ సర్టిఫికెట్లను అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు.
వెబ్ ఆప్షన్లు:
డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవచ్చు. విద్యార్థులు ప్రాధాన్యత క్రమంలో కాలేజీలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడం ద్వారా మంచి కాలేజీలో సీటు పొందే అవకాశాలు పెరుగుతాయి.
సీట్ల కేటాయింపు:
అభ్యర్థులు పొందిన ర్యాంకు, ఎంచుకున్న ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్ల కేటాయింపు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ద్వారా తెలుసుకోవచ్చు.
సెల్ఫ్-రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్:
సీటు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత.. కాలేజీలో గడువు (జులై 20 నుంచి జులై 23) లోగా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లతో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
అవసరమైన డాక్యుమెంట్స్:
AP ICET ర్యాంక్ కార్డ్.
AP ICET హాల్ టికెట్.
డిగ్రీ మార్క్స్ మెమోలు, ప్రొవిజనల్/డిగ్రీ సర్టిఫికెట్
ఇంటర్మీడియట్, SSC మార్క్స్ మెమోలు
స్టడీ సర్టిఫికెట్లు (క్లాస్ 6 నుంచి డిగ్రీ వరకు)
క్యాస్ట్ సర్టిఫికెట్.
ఇన్కమ్ సర్టిఫికెట్.
ఆధార్ కార్డ్.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
గమనిక:
విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సంబంధించిన అప్ డేట్స్ కోసం cets.apsche.ap.gov.in/ICET వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలని అధికారులు సూచించారు.





