HomeJOBSఏపీ వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..

ఏపీ వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..

ఏపీ వైద్య ఆరోగ్య& కుటుంబ సంక్షేమ శాఖ.. కృష్ణా జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మాసిస్ట్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు: 60
ల్యాబ్ టెక్నీషియన్: 19
ఫీమేల్ నర్సింగ్: 16
స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్: 10
ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01
డేటా ఎంట్రీ ఆపరేటర్: 04
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: 10

విద్యార్హతలు:
1.ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే వారు డిప్లొమా (MLT) లేదా బీఎస్సీ (MLT)పూర్తి చేసి ఉండాలి.
2.ఫార్మాసిస్ట్ పోస్టులకు డిప్లొమా/డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసి.. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
3.డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
4.నర్సింగ్ ఆర్డర్లీ/వాచ్‌మెన్/లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలి.

వయస్సు (01-12-2025 నాటికి):
అభ్యర్థుల గరిష్ట వయస్సు 42 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు: ఓసీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫీజు చెల్లింపు విధానం: ‘District Medical & Health Officer, Krishna District’ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీయాలి.

అప్లికేషన్ చివరి తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 31 (సాయంత్రం 5:00 గంటల)వరకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ krishna.ap.gov.in నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. పూర్తి చేసిన ఫారమ్‌ను అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి Office of the District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam, Krishna district అడ్రస్‌లో ఇవ్వాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here