ఏపీ హైకోర్టు (APHC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 300 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ మార్చి 30న ప్రారంభమై, ఏప్రిల్ 19 వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 300
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ పోస్టులు- 78
డేటా ఎంట్రీ ఆపరేటర్- 50
టైపిస్ట్ -44
కాపీయిస్ట్- 34
కంప్యూటర్ ఆపరేటర్ -31
ఇతర పోస్టులు..
వయస్సు: 01.01.2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది).
జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 20,000 నుంచి రూ.1,47,760 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE):
ఈ పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
నైపుణ్య పరీక్ష (Skill Test):
టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. తుది ఎంపిక పూర్తిగా స్కిల్ టెస్ట్ మార్కుల ఆధారంగానే ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి, అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ aphc.gov.in సంప్రదించవచ్చు.





