ఏపీ హైకోర్టు నుంచి న్యాయ నిపుణులు, న్యాయవాదుల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని మొత్తం 40 డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులను భర్తీ చేయడానికి హైకోర్టు అప్లికేషన్లు కోరుతోంది. ఇందులో రెగ్యులర్ డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులతో పాటు ఎంట్రీ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. నెలకు రూ. 1,44,840 నుంచి రూ.1,94,660 వరకు జీతం లభించే ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లు పంపడానికి చివరి తేదీ అక్టోబర్ 15గా నిర్ణయించారు.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు :
ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 40 డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో.. 30 పోస్టులు సివిల్ జడ్జి కేటగిరీకి చెందినవి కాగా.. మరో 10 పోస్టులు డిస్ట్రిక్ట్ జడ్జి (ఎంట్రీ లెవెల్) కింద భర్తీ చేయనున్నారు.
అర్హతలు:
డిస్ట్రిక్ట్ జడ్జి (30 పోస్టులు): సివిల్ జడ్జిలుగా కనీసం 3 సంవత్సరాల సర్వీస్ , మొత్తం 7 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. అప్లై చేసుకునే వారికి గరిష్ట వయస్సు సెప్టెంబర్ 1, 2026 నాటికి 35 సంవత్సరాలు దాటకూడదు.
డిస్ట్రిక్ట్ జడ్జి – ఎంట్రీ లెవెల్ (10 పోస్టులు): లా డిగ్రీ పూర్తి చేసి, అడ్వకేట్‌గా కనీసం 7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వారు లేదా తత్సమాన జ్యుడీషియల్ సర్వీస్ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ఎంట్రీ లెవెల్ పోస్టులకు ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1,500.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 750 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష (రైటింగ్ ఎగ్జామ్), వైవా (ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (aphc.gov.in) ద్వారా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ యాడ్ చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్లో పేర్కొన్న చిరునామాకు అక్టోబర్ 15వ తేదీలోగా చేరేలా పంపాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ aphc.gov.in సంప్రదించవచ్చు





