ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 49 బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో విధానంలో అధికార వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే.. డిసెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ 06
2. జూనియర్ ఆడిటర్ 01
3. టైపిస్ట్ 02
4. టైపిస్ట్/స్టెనో 01
5. ఎంపీహెచ్ఏ 01
6. హెల్త్ అసిస్టెంట్ 01
7. మెటర్నిటీ అసిస్టెంట్ 01
8. బోర్ వెల్ ఆపరేటర్ 01
9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 09 పోస్టులు
10. షరాఫ్ 01
11. ఆఫీస్ సబార్డినేట్ 07
12. వాచ్ మెన్ 03
13. నైట్ వాచ్ మెన్ 02
14. బంగ్లా వాచర్ 01
15. కమాటి 02
16. స్కావెంజర్ 01
17. స్వీపర్ 01
18. పీహెచ్ వర్కర్ 01
19. యుటెన్సిల్ క్లీనర్ 01
20. బేరర్ 01
21. వాచ్ మెన్ కమ్ హెల్పర్ 01
22. జూనియర్ స్టెనోగ్రాఫర్ 01
23. వెటర్నరీ అసిస్టెంట్ 01
24. ఫార్మసిస్ట్ గ్రేడ్-2 01
మొత్తం ఖాళీల సంఖ్య 49
విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://www.gunturap.in/dw2022/