ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇంధన వనరుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ట్రాన్స్కో, జెన్కోతో పాటు వివిధ డిస్కంలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జులై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఏఈఈ ఉద్యోగాలు.. పూర్తి ఖాళీల వివరాలు:
సంస్థల వారీగా ఖాళీలు:
ఏపీట్రాన్స్‌కో (AP Transco): 200 పోస్టులు
ఏపీజెన్‌కో (AP Genco): 100 పోస్టులు
ఏపీఈపీడీసీఎల్ (APEPDCL): 135 పోస్టులు
ఏపీఎస్‌పీడీసీఎల్ (APSPDCL): 134 పోస్టులు
ఏపీసీపీడీసీఎల్ (APCPDCL): 60 పోస్టులు
విభాగాల వారీగా మరిన్ని వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో ఏపీజెన్‌కోకు సంబంధించి ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కలిపి 80 పోస్టులు ఉండగా, సివిల్ విభాగంలో 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే, ఏపీ ట్రాన్స్‌కోలో 167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం పోస్టులు ఉన్నాయి.
అర్హతలు & ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం, మెకానికల్ విభాగాల్లో బీఈ (B.E) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల జూన్ 30వ తేదీ నుండి జూలై 27వ… తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు, సిలబస్, పరీక్ష విధానం, అభ్యర్థుల వయోపరిమితి వంటి నిబంధనలను రానున్న 2, 3 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.





