ఏపీలోని బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ (AP EdCET-2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది అభ్యర్థులు ఊహించని రీతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కావడం విశేషం. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, వాట్సాప్ ద్వారా కూడా పొందే సదుపాయాన్ని కల్పించారు.
రికార్డ్ స్థాయి ఉత్తీర్ణత:
ఈ సంవత్సరం ఏపీ ఎడ్‌సెట్ పరీక్షా ఫలితాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,880 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో ఏకంగా 19,741 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 99.30 శాతంగా రికార్డయ్యింది.
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ?
1.మొదటగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EDCETలోకి లాగిన్ అవ్వండి.
2.హోం పేజీలో కనిపించే ‘Results’ లేదా ‘Download Rank Card’ లింక్‌పై క్లిక్ చేయండి.
3.అక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి.
- వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే.. ర్యాంకు కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి
‘మన మిత్ర’ వాట్సాప్‌లో క్షణాల్లో ర్యాంక్ కార్డ్!
ఈసారి అభ్యర్థుల సౌకర్యార్థం ఏపీ ఎడ్‌సెట్ 2026 ఫలితాలను వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి తెచ్చారు. ‘మన మిత్ర’ ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా క్షణాల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
1.మీ మొబైల్‌లో ‘మన మిత్ర’ అధికారిక నంబర్ 95523 00009ను సేవ్ చేసుకోండి.
2.వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.
3.మీకు వచ్చే ఆప్షన్లలో “ఎడ్యుకేషన్ సర్వీసెస్” ఎంచుకోండి.
4.ఆ తర్వాత “ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు 2026” పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయగానే, మీ ర్యాంక్ కార్డు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.





