ఏపీ బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 29 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ రోజు అర్థరాత్రి వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. కాగా అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడిస్తారు. ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్‌కు చివరి గడువు: ఈరోజుతో రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్: అక్టోబర్ 4 న ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
వెబ్ ఆప్షన్ల ఎంపిక: అక్టోబరు 5- 7 వరకు అభ్యర్థులు నచ్చిన కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
వెబ్ ఆప్షన్ల మార్పు (ఎడిటింగ్): ఈ నెల 8న ఎంచుకున్న ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సీట్ల కేటాయింపు : అక్టోబర్ 10న సీట్ల కేటాయింపు ఫలితాలు ప్రకటిస్తారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ & తరగతులు ప్రారంభం: ఈ నెల 13న సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
అర్హులైన అభ్యర్థులు https://edcet-sche.aptonline.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఏపీ ఎడ్‌సెట్ – 2025:
ఏపీ ఎడ్‌సెట్ – 2025 పరీక్షకోసం 17,795 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో 14,527 మంది క్వాలిఫై అయ్యారు.మొత్తం 5 విభాగాల్లో కలిపి 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
ముందుగా అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి.
అక్కడ కనిపించే ఎడ్ సెట్ – 2025 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి.
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
చివరగా.. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.





