ఏపీ ఎప్‌సెట్ (AP EAPCET 2026) పరీక్ష రాసి, రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎప్‌సెట్ ఫలితాలు నేడు అధికారికంగా విడుదలయ్యాయి. ఈసారి కూడా రిజల్ట్స్‌లో అమ్మాయిలే అత్యధిక మార్కులు సాధించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో 70.52 శాతం మంది పాస్ అవ్వగా, ఇందులో అమ్మాయిలు ఏకంగా 71.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించి అబ్బాయిల కంటే ముందున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,82,317 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. పరీక్ష రాసిన వాళ్లంతా తమ ర్యాంక్ కార్డులను అఫీషియల్ వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అగ్రికల్చర్ & ఫార్మసీ ఫలితాలు:
ఇక అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ విషయానికి వస్తే.. ఈ విభాగంలో మొత్తం 63,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ స్ట్రీమ్‌లో ఏకంగా 89.59% మంది పాస్ అయి రికార్డు క్రియేట్ చేశారు.
ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
స్టెప్ 1: మొదట అధికారిక వెబ్‌సైట్ apsche.ap.gov.in ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో మీకు “Results” లేదా Download Rank Card” అనే ఆప్షన్ కనిపిస్తుంది.వాటిలో ఒక దానిని సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 3: ఇప్పుడు ఓపెన్ అయిన కొత్త పేజీలో రిజిస్ట్రేషన్ నంబర్, మీ హాల్ టికెట్ నంబర్, వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేయండి.
స్టెప్ 4: వివరాలన్నీ కరెక్ట్‌గా టైప్ చేశాక, కింద ఉన్న “View result/Get Rank Card” బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: వెంటనే మీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో మీ మార్కులు, ర్యాంక్ సరిచూసుకోండి.
స్టెప్ 6: కౌన్సిలింగ్ కోసం ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.





