ఏపీ ఉన్నత విద్యా మండలి (APSCHE) తరపున జేఎన్‌టీయూ కాకినాడ ‘ఏపీ ఈఏపీసెట్-2026’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్చి 7 వరకు లేట్ ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ పరీక్షలు మే 12 నుంచి ప్రారంభమవుతాయి. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఫీజు చెల్లించి, ఆపై వివరాలను ఎంటర్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
అప్లికేషన్లకు చివరి తేదీ :
మార్చి 7వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పరీక్షా తేదీలు:
మే 12 నుంచి మే 20వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
అప్లికేషన్ విధానం:
- వెబ్‌సైట్‌లో కేటగిరీని బట్టి ఓసీ అభ్యర్థులు రూ. 800,బీసీ రూ. 750,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ. 700 ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే ‘Payment ID’తో వ్యక్తిగత వివరాలు, అర్హతలను ఎంటర్ చేయాలి.
- తగిన సైజులో స్కాన్ చేసిన ఫోటో.. సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
- వివరాలన్నీ చెక్ చేసుకుని ‘Submit’ చేసి, అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవాలి.
ఇంటర్ (MPC/BiPC) పూర్తి చేసిన వారు లేదా ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఏపీ ఎంసెట్ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ సంప్రదించవచ్చు.





