ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) పరీక్షలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 28 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మే 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) హాల్ టికెట్లను ఎల్లుండి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు.
హాల్ టికెట్ల విడుదల, డౌన్‌లోడ్:
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 28న హాల్ టికెట్లు విడుదలవుతాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ మీద పరీక్షా కేంద్రం,సమయం, నిబంధనలను క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్షల షెడ్యూల్ వివరాలివే:
పరీక్షలు మే 12 నుంచి ప్రారంభమై మే 20 వరకు వివిధ విడతల్లో జరగనున్నాయి.
ఇంజినీరింగ్ విభాగం: మే 12, 13, 14, 15, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగం: మే 19 , 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) రెండు షిఫ్టుల్లో (ఉదయం, మధ్యాహ్నం) నిర్వహించనున్నారు.
కీ, రిజల్ట్:
పరీక్షలు ముగిసిన వెంటనే మే 23న ప్రిలిమినరీ కీని విడుదల చేస్తారు. ఈ కీ పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 25 వరకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. జూన్ 1వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. రిజల్ట్ ఆధారంగానే రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.
అభ్యర్థులకు సూచనలు:
1.హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దానిపై మీ ఫోటో, సంతకం స్పష్టంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
2.పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవడం మంచిది.
3.ఆన్‌లైన్ పరీక్ష కాబట్టి మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది.
- అప్ డేట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.





