ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! ఏపీ ఈఏపీసెట్ 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల కౌన్సెలింగ్ కలిపి 67.48% ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,52,100 సీట్లకు గాను 1,02,650 సీట్లు నిండగా.. ఇంకా 49,450 సీట్లు మిగిలి ఉన్నాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు గడువులోగా కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయడం తప్పనిసరి. లేకపోతే అడ్మిషన్ రద్దవుతుంది.
కాలేజీల్లో రిపోర్ట్ :
మెరిట్, రిజర్వేషన్లు , ఖాళీల ఆధారంగా కేటాయించిన ఈ సీట్లను పొందడానికి విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు, నిర్ణీత గడువులోగా ఒరిజినల్ సర్టిఫికేట్లతో సంబంధిత కాలేజీలో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా రిపోర్ట్ చేయకపోతే.. కేటాయించిన సీటు రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు. క్రీడా కోటా సీట్ల భర్తీకి సంబంధించి నేషనల్ ర్యాంకు ఆధారంగా 659 సీట్లను ప్రస్తుతం పెండింగ్‌లో పెట్టారు.
ఇంజినీరింగ్‌లో 67% సీట్ల భర్తీ:
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ మూడు విడతల కౌన్సెలింగ్ కలిపి మొత్తం 67.48 శాతం సీట్లు భర్తీ.. అయినట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,52,100 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 1,02,650 సీట్లు నిండాయి. ఇంకా 49,450 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో 15,194 సీట్లు ఉండగా 13,556 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 9,479 సీట్లకు గాను 7,441 సీట్లు నిండాయి.
విద్యార్థులకు గమనిక:
సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం బెస్ట్. తద్వారా అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండిలా:
1.ముందుగా ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్ అయిన cap.apcfss.in ఓపెన్ చేయండి.
2.తర్వాత హోమ్‌పేజీలో కనిపించే ‘Download Allotment Order’ లేదా ‘Candidate Login’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేయండి.
- అన్ని వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ‘Submit’ లేదా ‘Login’ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ స్క్రీన్‌పై మీ సీట్ అలాట్‌మెంట్ వివరాలు (కాలేజీ పేరు, కోర్సు వివరాలు) కనిపిస్తాయి.
- అక్కడ ఉన్న ‘Download Allotment Order’ ఆప్షన్‌పై క్లిక్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. దీనిని వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.





