ఏపీ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు.. తాజాగా రిజిస్ట్రేషన్ గడువు పొడగిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులు అక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ 7న వెబ్ ఆప్షన్ల ఎడిట్ చేసుకోవచ్చు. సీట్ల కేటయింపు వివరాలు అక్టోబర్ 10 వెల్లడిస్తారు. కాగా 11న కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలు :
రిజిస్ట్రేషన్ గడువు: విద్యార్థులు అక్టోబర్ 3 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్: అక్టోబర్ 4 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
వెబ్ ఆప్షన్లకు గడువు: అక్టోబర్ 6 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
వెబ్ ఆప్షన్ల ఎడిట్: అక్టోబర్ 7 న వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు: అక్టోబర్ 10వ తేదీన వెబ్ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిస్తారు.
కాలేజీల్లో రిపోర్టింగ్: అక్టోబర్ 11 లోపు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: అర్హత కలిగిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియను https://oamdc.ucanapply.com/ అనే వెబ్‌సైట్ ద్వారా పూర్తి చేసుకోవాలి. అలాట్‌మెంట్ కాపీని కూడా ఇక్కడ నుండే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సీట్ల కేటాయింపు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లోని డిగ్రీ కోర్సుల్లో ఈ సీట్లను భర్తీ చేస్తారు.
మిగిలిన సీట్లు: మొదటి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 3,82,038 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,30,273 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 2,51,765 సీట్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండో విడతలో ఈ మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు.
తరువాత ప్రక్రియ: సీట్లన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే.. ఆ తరువాత స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు.
గమనిక: సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 11 లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. లేదంటే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.





