ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP DEECET 2026) రెండో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో మిగిలిపోయిన ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కన్వీనర్ , పాఠశాల విద్యా సంయుక్త సంచాలకులు బి.లింగేశ్వర రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగానే అర్హత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొదటి విడతలో సీట్లు రాని వారికి లేదా పాల్గొనలేకపోయిన వారికి.. ఇది చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.
ముఖ్యమైన తేదీలు, షెడ్యూల్ వివరాలు:
కౌన్సెలింగ్ ప్రక్రియ: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కౌన్సెలింగ్ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు: అభ్యర్థులు నమోదు చేసుకున్న ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 17 నుంచి 20వ తేదీ మధ్య సీట్ల ప్రక్రియ కేటాయింపు పూర్తి కానుంది.
డాక్యుమెంట్ వెరిషికేషన్: సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21 నుంచి 24వ తేదీలోగా సంబంధిత డైట్ (DIET) కాలేజీలకు నేరుగా వెళ్లి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అడ్మిషన్ లెటర్ పొందాల్సి ఉంటుంది.
తరగతుల ప్రారంభం:
డీఈడీ మొదటి సంవత్సరం, విద్యార్థులకు సంబంధించిన రెగ్యులర్ తరగతులు ఆగస్టు 27వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా తమ కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.





