ఏపీ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ.. D.El.Ed కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే.. డీఈఈసెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్ కాలేజీలు, ప్రైవేట్ సంస్థల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన వారు డీఈఈసెట్‌కు అర్హులు.
ముఖ్యమైన వివరాలు:
విద్యార్హత: అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. (OC/BCలకు 50%, SC/ST/PH అభ్యర్థులకు 45% మార్కులు ఉండాలి).
వయస్సు: సెప్టెంబర్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 17 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం:
ప్రవేశ పరీక్ష (100 మార్కులకు) ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.
అభ్యర్థి సాధించిన మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా సీట్లును కేటాయిస్తారు.
అప్లికేషన్ విధానం:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ apdeecet.apcfss.in లేదా cse.ap.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
- వెబ్‌సైట్‌లోని ‘Payment’ లింక్‌పై క్లిక్ చేయండి. మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేసి, నెట్ బ్యాంకింగ్/డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించండి. తర్వాత మీకు ఒక ‘Journal Number’ వస్తుంది.
3: ఫీజు చెల్లించిన తర్వాత ‘Submit Application’ లింక్‌పై క్లిక్ చేయండి. మీ జర్నల్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
4: నోటిఫికేషన్ ప్రకారం మీ ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
5: మీ విద్యార్హతలు, అడ్రస్, రిజర్వేషన్ కేటగిరీ, పరీక్ష రాయాలనుకుంటున్న సబ్జెక్టు వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయండి.
6: అన్ని వివరాలు చెక్ చేచసుకున్న తర్వాత ‘Submit’ బటన్ నొక్కండి. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.





