HomeADMISSIONSఏపీ డీఈఈసెట్ 2026.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ డీఈఈసెట్ 2026.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీ ప్రాథమిక విద్యా బోధనలో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులకు విద్యాశాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈఎల్ఈడీ (D.El.Ed) కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించే డీఈఈసెట్ (DEECET)-2026 దరఖాస్తు గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించినట్లు తెలిపింది. గతంలో విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్లకు ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉండగా తాజాగా దీనిని పొడిగించారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఏపీలోని ప్రభుత్వ డైట్ (DIET) కాలేజీలతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో సీట్లు కేటాయిస్తారు.డీఈఈసెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన అర్హతలు:
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 45% మార్కులు ఉన్నా సరిపోతుంది.

వయస్సు: 2026 సెప్టెంబర్ 1 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి లేదు.

అప్లికేషన్ ఫీజు:
ఆసక్తి గల అభ్యర్థులు రూ. 1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి, అధికారిక వెబ్‌సైట్ https://apdeecet.apcfss.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

అప్లై చేసుకునే విధానం:
1: మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apdeecet.apcfss.in లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత హోమ్ పేజీలో ‘Payment’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

  1. అనంతరం మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
  2. తర్వాత అప్లికేషన్ ఫీజు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఫీజు చెల్లించగానే మీకు ఒక ‘Journal Number’ వస్తుంది. దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  3. ఫీజు చెల్లించిన తర్వాత వెబ్‌సైట్‌లో ‘Submit Application’ లింక్‌పై క్లిక్ చేయాలి. మీకు వచ్చిన జర్నల్ నంబర్, పేమెంట్ తేదీ, పుట్టిన తేదీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  4. ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలు , అడ్రస్, విద్యార్హతలు ఎంటర్ చేయాలి.
  5. చివరగా.. మీ ఫోటో, సంతకం ఉన్న స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాలి. సాధారణంగా ఫోటో 3.5cm X 4.5cm సైజులో ఉండాలి. ఫోటో కిందనే సంతకం ఉండేలా చూసుకోవడం మంచిది.
  6. అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఒకసారి అన్ని వివరాలు చెక్ చేసుకుని ‘Submit’ బటన్ క్లిక్ చేయాలి. చివరగా మీ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here