ఏపీలోని జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) ఇటీవల విడుదల చేసిన 338 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక అప్డేట్ వచ్చింది. సాంకేతిక కారణాలు లేదా సమయం లేక ఇప్పటి వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోలేకపోయిన అభ్యర్థులకు అవకాశం ఇస్తూ, అప్లికేషన్ గడువును ఆగస్టు 15 వరకు పొడిగించారు. కాబట్టి డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు.
పోస్టుల వివరాలు & జిల్లాలు
మొత్తం 338 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్: 295 పోస్టులు
స్టాఫ్ అసిస్టెంట్: 43 పోస్టులు
ఈ నియామకాలు చిత్తూరు, ప్రకాశం, విజయనగరం, వైఎస్సార్ కడప , విశాఖపట్నం జిల్లాల పరిధిలోని ఏపీసీఓబీ (APCOB) శాఖల్లో జరగనున్నాయి.
ఎవరెవరు అర్హులు?
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా పీజీ (PG) పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాష (తెలుగు)లో మంచి ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి).
స్థానికత: అభ్యర్థి ఏ జిల్లా ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్నారో, ఆ జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థి అయి ఉండటం అత్యంత ముఖ్యం.
ఎంపిక విధానం & పరీక్ష నమూనా:
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం 200 మార్కులకు 120 నిమిషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. 5 విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.పేపర్ లో కింది సెలబస్ గురించి ప్రశ్నలు అడుగుతారు.
రీజనింగ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ & డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇంగ్లీష్ లాంగ్వేజ్
ఫైనాన్స్ అవేర్నెస్
కంప్యూటర్ పరిజ్ఞానం
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు (0.25) మార్కు కట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు.. రూ.590 కాగా,ఓసీ,బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.826 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఎప్పుడు?
ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ పరీక్షను ఆగస్టు లేదా సెప్టెంబరులో నిర్వహించే అవకాశం ఉంది. అప్లికేషన్ గడువు ఆగస్టు 15తో ముగుస్తుంది కాబట్టి వెంటనే అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.





