భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లోని సివిలియన్ గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం ‘AOC గ్రూప్ C రిక్రూట్మెంట్ 2026’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2615 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రేడ్స్‌మేన్ మేట్, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ , మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు ఈ రిక్రూట్మెంట్లో అందుబాటులో ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, అర్హతలు , అప్లికేషన్ విధానానికి సంబంధించిన వివరాలు..
ఖాళీల వివరాలు:
ట్రేడ్స్‌మేన్ మేట్: 1799 పోస్టులు
ఫైర్‌మ్యాన్: 508 పోస్టులు
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS): 142 పోస్టులు
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA): 104 పోస్టులు
మెటీరియల్ అసిస్టెంట్: 50 పోస్టులు
మొత్తం ఖాళీలు: 2615
విద్యార్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పోస్టును బట్టి తగిన విద్యార్హతలను కలిగి ఉండాలి. ట్రేడ్స్‌మేన్ మేట్, ఫైర్‌మ్యాన్, ఎమ్‌టీఎస్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్ పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ టైపింగ్ వేగం ఉండాలి. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం జీతం లభిస్తుంది. ట్రేడ్స్‌మేన్ మేట్ , MTS పోస్టులకు లెవెల్-1 (రూ.18,000 –రూ.56,900), ఫైర్‌మ్యాన్, JOA పోస్టులకు లెవెల్-2 (రూ.19,900–రూ.63,200), అలాగే మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు లెవెల్-5 (రూ.29,200–రూ. 92,300)జీతం చెల్లించనున్నారు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్ (JOAకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నవంబర్ లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానుంది.ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22 లోపు అధికారిక వెబ్సైట్ aocrecruitment.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.





