HomeLATESTఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్​ కోర్సుల నోటిఫికేషన్​

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్​ కోర్సుల నోటిఫికేషన్​

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్​ ఫర్ డిస్టెన్స్​ ఎ డ్యుకేషన్​ (ANUCDE) దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్​ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదల చేసింది.

డిగ్రీ కోర్సులకు మూడేళ్ల వ్యవధిలో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో చేరేందుకు ఇంటర్​, పాలిటెక్నిక్​​, రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులు. బీఏ, బీకాం, బీబీఏ ప్రోగ్రామ్​లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థి ఆసక్తిని బట్టి తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియంను ఎంచుకోవచ్చు.

పీజీ కోర్సు సంబంధించి రెండేళ్లలో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఎంఏ, ఎంకాం ప్రోగ్రామ్​లు అందుబాటులో ఉన్నాయి. ఎంఏలో ఇంగ్లీష్​, తెలుగు, సంస్కృతం, హిందీ, ఎకనామిక్స్​, హిస్టరీ, పొలిటికల్​ సైన్స్​, సోషియాలజీ, జర్నలిజం అండ్​ మాస్​ కమ్యూనికేషన్​, హ్యూమన్​ రిసోర్సెస్​ మేనేజ్​మెంట్​ స్పెషలైజేషన్లు ఉన్నాయి. పీజీ కోర్సుల్లో చేరేందుకు స్పెషలైజేషన్​ సంబంధించి డిగ్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.

డిగ్రీ, పీజీతో పాటు ఏడాది వ్యవధితో లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్​ సైన్స్​ కోర్సులు, డిప్లొమా ఇన్​ ఫుడ్​ ప్రొడక్షన్​ కోర్సు, హోటల్​ అండ్​ హాస్పిటల్​ హౌస్​ కీపింగ్​ సర్టిఫికేట్​ కోర్సులు ఉన్నాయి. వీటికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లైబ్రరీ అండ్​ ఇన్ఫర్మేషన్​ సైన్స్​లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. సర్టిఫికేట్​ కోర్స్​ ఇన్​ హెచ్​ఐవీ ఎయిడ్స్​ కౌన్సెలింగ్​ లో చేరేందుకు ఇంటర్​తో పాటు పారామెడికల్​ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు మార్చి 31 చివరితేది.

వెబ్​సైట్​ : www.anucde.info

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!