ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగంలో తాత్కాలిక టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఈ పోస్టులు సెమిస్టర్ ప్రాతిపదికన, 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు బోధించడానికి ఉద్దేశించినవి. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత విభాగాధిపతుల ఆధీనంలో పని చేయాల్సి ఉంటుంది.
జీతం వివరాలు:
అభ్యర్థులకు ఒక్కో సబ్జెక్టుకు గంటకు ₹750 చొప్పున, ఒక్క ల్యాబ్‌కు ₹500 చొప్పున చెల్లిస్తారు. ఇదిలా ఉంటే.. మొత్తం సెమిస్టర్‌కు ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా ₹1,10,000 వరకు మాత్రమే వేతనం చెల్లిస్తారు.
అర్హతలు:
UGC, NCTE,AICTE, PCI, BCI, COA నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్‌ను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ (www.andhrauniversity.edu.in )నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్స్ కు చివరి తేదీ: జులై 13. 2025 .
ఇంటర్వ్యూలు ప్రారంభం: జులై 16.
ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్:
అప్లికేషన్ ఫారమ్
పీజీ, పీహెచ్‌డీ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లు
అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ (1 సెట్)
2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.






