ఏపీ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్.. నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలతో కలిసి పని చేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సాధికారతకు దోహదపడేందుకు ఇది మంచి అవకాశం .
ముఖ్య వివరాలు:
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
మొత్తం ఖాళీలు: 170
అప్లికేషన్ ప్రారంభ తేదీ: జులై 7, 2025.
అప్లికేషన్ చివరి తేదీ: జులై 18.
అప్లికేషన్ విధానం: ఆన్లైన్ ద్వారా.
అధికారిక వెబ్‌సైట్: https://streenidhi-apamrecruitment.aptonline.in
అర్హతలు:
విద్యార్హత: అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండాలి (ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ లేదా లా ఏదైనా). UGC/AICTE/DEB గుర్తింపు పొందిన ఓపెన్/డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే)
కంప్యూటర్ పరిజ్ఞానం:
MS ఆఫీస్‌లో ప్రావీణ్యం ఉండాలి. NIIT, BDPS, CMC, RSETI లేదా విశ్వవిద్యాలయాల నుంచి MS ఆఫీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
అనుభవం:
కోఆపరేటివ్ సొసైటీలు, షెడ్యూల్డ్ బ్యాంకులు, SERP/MEPMA లేదా కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ సంస్థలలో సంబంధిత పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అనుభవానికి తగిన మార్కులు కేటాయిస్తారు.
3 సంవత్సరాల కంటే ఎక్కువ: 15 మార్కులు
3 సంవత్సరాలు: 12 మార్కులు
2 సంవత్సరాలు: 8 మార్కులు
కనీసం 1 సంవత్సరం: 4 మార్కులు.
వయస్సు:
జూన్ 1, 2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతే కాకుండా 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
నివాసం:
అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీలో నివాసితులై ఉండాలి.
అప్లికేషన్ ప్రక్రియ:
ఆసక్తి గల అభ్యర్థులు స్త్రీ నిధి అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 1,000/-.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా అకడమిక్ పనితీరు, సంబంధిత అనుభవం ఆధారంగా జరుగుతుంది. (మొత్తం 75 మార్కులు). షార్ట్‌లిస్ట్ లో ఎంపికైన అభ్యర్థులను (ప్రతి కేటగిరీకి 1:4 నిష్పత్తిలో) ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు (25 మార్కులు). అప్లికేషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించే అవకాశం కూడా ఉంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.