ఆంధ్రప్రదేశ్ లోని సీఎం జగన్ సర్కార్ వైద్య విభాగం బలోపేతానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వైద్య శాఖలో ఖాళీల (Jobs) భర్తీకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఏపీ డీఎంఈ (DME AP) రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. డీఎంఈ ఆధ్వర్యంలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని 49 విభాగాల్లో 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 19లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హతలు: సంబంధిత విభాగాల్లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్) విద్యార్హత పొందిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వ మెడికల్&డెంటల్ కాలేజీల్లో పీజీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేశారు.
వేతనాలు:
ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.65 వేల నుంచి రూ.85 వేల వరకు పోస్టుల ఆధారంగా వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పందం ప్రకారం ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. పీజీలో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిపికేషన్లో వెల్లడించారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://www.dme.ap.nic.in/