నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ సిద్ధమైంది. 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తారు. ప్రస్తుతం వస్తున్న సమాచారం ఆధారంగా ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియామక ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ఇటీవల డీజీపీ సైతం ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. ఒక వేళ ఏదైనా కారణాలతో ఆలస్యమైనా.. ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టులకు డిసెంబర్ నెలాఖరు నాటికి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలన్నది అధికారుల ఆలోచన. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులను నిర్వహించే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు..
- సివిల్ ఎస్సై పోస్టులు – 387,
- 2.ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు – 96,
- సివిల్ కానిస్టేబుల్ పోస్టులు – 3508,
- ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలిన్) పోస్టులు-2520.