ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (AP DME) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (డీఎం, ఎంసీహెచ్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఎండీఎస్) విద్యార్హత కలిగిన వారు అప్లైచేసుకోవచ్చు. వయస్సు 45 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వేతనం: రెసిడెంట్ స్పెషలిస్ట్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.85 వేల వేతనం ఉంటుంది. రెసిడెంట్ స్పెషలిస్ట్ గా ఎంపికైన వారికి రూ.70 వేల వేతనం ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్: https://dme.ap.nic.in/
అభ్యర్థుల ఎంపిక: అభ్యర్థులు పీజీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఎంటుంది.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.