HomeLATESTఏపీలో భారీగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే అప్లికేషన్లు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

ఏపీలో భారీగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ రోజు నుంచే అప్లికేషన్లు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?

ఏపీలో టీచర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ జాబ్స్ భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ మేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ వారి నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 1358 టీచర్‌ (ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 29 నుంచి.. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది.

దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాత్రి 11:59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. http://apkgbv.apcfss.in/ వెబ్ సైట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్హలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుక కేవలం మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

ఖాళీల వివరాలు..
– ప్రిన్సిపాల్ పోస్టులు 92
– పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 846
– సీఆర్టీ పోస్టులు 374
– ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులు 46

వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు 18-42 ఏళ్లను వయో పరిమితిగా విధించారు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

ఎలా అప్లై చేయాలంటే: అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!