ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ లో దాదాపు 51 శాతం మంది విద్యార్థులు ఫెయిలయిన విషయం తెలిసిందే. మనస్తాపంతో అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఆందోళనకు దిగటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్మీట్లో ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ మినిమమ్ పాస్ మార్కులు వేస్తామని తెలిపారు.
Advertisement