విద్యాసంస్థలకు17 నుంచి 30 వరకూ సర్కారు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆ టైమ్లో నిర్వహించదలచిన పరీక్షలన్నీ వాయిదా వేయాలని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వర్సిటీలకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఉస్మానియా, జేఎన్టీయూ, తెలంగాణ వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ తదితర వర్సిటీల్లో యూజీ, పీజీ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల రీషెడ్యూల్ తర్వాత ఇవ్వనున్నట్టు వర్సిటీలు ప్రకటించాయి. 18 నుంచి 22 వరకూ జరగాల్సిన పాలిటెక్నిక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నట్టు టెక్నికల్ బోర్డు తెలిపింది.
