HomeJOBSఎయిమ్స్ మంగళగిరిలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎయిమ్స్ మంగళగిరిలో.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. మంగళగిరి.. ఖాళీగా ఉన్న వివిధ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ లేదా ఎంహెచ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్‌ 26వ తేదీ లోపు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఉద్యోగాల కోసం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

పూర్తి వివరాలు:
విభాగాల వారిగా ఖాళీలు:
మొత్తం-121 పోస్టులు
ప్రొఫెసర్-10 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్-08 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్-20 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్-83 పోస్టులు

అర్హతలు:
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ లేదా ఎంహెచ్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు తప్పనిసరిగా ఉద్యోగానుభవం ఉండాలి.

వయస్సు:
అభ్యర్థుల వయస్సు 58 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: 5 ఏళ్లు

ఓబీసీ అభ్యర్థులకు: 3 ఏళ్లు

పీడబ్ల్యుబీడీ (PWD) అభ్యర్థులకు: 10 ఏళ్లు

ప్రభుత్వ ఉద్యోగులకు: 5 ఏళ్లు
జీతం:
ప్రొఫెసర్: రూ. 1,68,900

అడిషనల్ ప్రొఫెసర్: రూ. 1,48,200

అసోసియేట్ ప్రొఫెసర్: రూ.1,38,300

అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ. 1,01,500

అప్లికేషన్ ఫీజు:

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 3,100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు 2,100 చెల్లించాలి.

పీడబ్ల్యుబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ చివరి తేదీ: అక్టోబర్‌ 26వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు.

మరిన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్ సంప్రదించండి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here