ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) న్యూఢిల్లీ.. దేశవ్యాప్తంగా ఉన్న 28 ఎయిమ్స్ , ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-B, గ్రూప్-C పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-5 (CRE-5) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,484 పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హతలు, పరీక్ష విధానం, అప్లికేషన్ ఫీజు వివరాలు
ఎయిమ్స్ సీఆర్ఈ-5 నోటిఫికేషన్ వివరాలు:
పోస్టులు:
ఈ సింగిల్-విండో రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 57 పోస్ట్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్‌డీసీ, యూడీసీ, జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్), ఫార్మసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, స్టెనోగ్రాఫర్, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III వంటి వివిధ రకాల పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఈ/బీటెక్, బీకామ్ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు అనుభవం అవసరం కాగా, మరికొన్ని పోస్టులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు.
వయోపరిమితి:
ఈ నోటిఫికేషన్ పరిధిలోని చాలా గ్రూప్-B పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలుగా.. గ్రూప్-C పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య నిర్ణయించారు. అయితే టెక్నికల్, సూపర్‌వైజరీ పోస్టులకు వయోపరిమితి 35 లేదా 40 ఏళ్ల వరకు ఉంది. వయోపరిమితిని జూన్ 30, 2026 నాటికి లెక్కిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PwBD) 10 ఏళ్ల వయోసడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తాము అప్లై చేసే ప్రతి పోస్ట్ గ్రూప్‌నకు విడివిడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.3,000 గా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 2,400 గా నిర్ణయించారు. దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు, వీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల అప్లికేషన్ ఫీజును ఫలితాల అనంతరం వారి ఖాతాల్లోకి తిరిగి రీఫండ్ చేస్తారు.
పరీక్షా విధానం:
ఈ పోస్టుల భర్తీకి జులై 25 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 100 ప్రశ్నలకు 400 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇందులో జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, కంప్యూటర్ విభాగం నుంచి 20 ప్రశ్నలు , అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అర్హత సాధించడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, ఓబీసీ 35%, ఎస్సీ/ఎస్టీలు 30% మార్కులు సాధించాలి.
అప్లికేషన్ విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు.





