ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలపరిమితికి ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 1066 జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి 26 వరకు నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, డ్రైవింగ్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థుల ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూలు జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయిలో నిర్వహించనున్నారు.





