తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల అడ్మిషన్లకు రెండు రోజులే గడువుంది. 2022-–23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సు నాలుగేళ్లు ఉంటుంది. ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మహిళా వ్యవసాయ కళాశాల, వనపర్తిలో 120 సీట్లు, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మహిళా వ్యవసాయ కళాశాల, కరీంనగర్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అర్హత: ఫిజికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ ఎంసెట్-2022 లేదా పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్-2022లో అర్హత సాధించాలి. వయసు17 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్లు: ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ డిసెంబర్ 5 వరకు దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలకు www.ug.mjptbcwreis.net వెబ్సైట్ సంప్రదించాలి.