సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులకు గుడ్ న్య్యూస్. భారతీయ ఆర్మీ రిక్రూట్‌మెంట్ హైదరాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ కి సన్నాహాలు చేస్తోంది. డిసెంబరు 8 నుంచి 16 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ రిక్రూట్‌మెంట్ కొనసాగుతుంది. అగ్నివీర్ టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మెన్స్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఇక్కడ పోటీలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలు, ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులవుతారు. తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే పోటీలకు రావాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి మేజర్ ప్రకాష్ చంద్ర ప్రకటన విడుదల చేశారు.