ఇండియన్ అర్మీలో (Indian Army) అగ్నివీర్ ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Agnipath Notification) విడుదలైంది. జులై నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. న్యూ రిక్రూట్‌మెంట్ స్కీమ్ తొలి రౌండ్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడున్న ర్యాంకులకు భిన్నంగా ఇండియన్ ఆర్మీలో డిస్ట్కింక్ట్ ర్యాంక్‌గా అగ్నివీర్ ఏర్పాటు చేసింది. ఆర్మీ నోటిఫికేషన్ తరహాలోనే నావికాదళంలో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జూన్ 21న, వైమానికాదళంలో రిక్రూట్‌మెంట్ కోసం జూన్ 24న నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రకటించింది. అగ్నిపథ్ నియామకాలకు అభ్యర్థులందరూ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని ఆర్మీ తెలిపింది. జూలై నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అగ్నిపథ్ స్కీమ్ అనౌన్స్ చేసింది. దీంతో త్రివిధ దళాల్లో నియామక నిబంధనల్లో చోటు చేసుకున్న మార్పులపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిరుద్యోగి ప్రాణాలను సైతం కోల్పోయాడు. ఈ ఆందోళనలు ఒకవైపు కొనసాగుతుండగానే.. అగ్నివీర్ నియామకాల షెడ్యూలును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్ అగ్నిపథ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులందరినీ “అగ్నివీర్స్” అని పిలుస్తారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కేడర్‌లలో నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి అగ్నివీర్లను నియమించుకుంటారు. తొలి ఏడాది దాదాపు 46,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది రిక్రూట్‌మెంట్ల సంఖ్య 5,000 చొప్పున పెరుగుతుంది. అగ్నివీరులకు నెలకు దాదాపు రూ.30 వేల నుంచి రూ.40 వేల జీతం లభిస్తుంది. వీరికి సంబంధించి జీతాలు, సెలవులు, సదుపాయాలు, విద్యార్హతలు.. అన్నింటినీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ : టెన్త్ పాసై ఉండాలి. 45 శాతం అగ్రిగేట్ మార్కులుండాలి. 33 శాతం మార్కులు ప్రతీ సబ్జెక్టులో తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులు వయస్సు 17 ఏళ్లు మించి ఉండాలి.
- అగ్నివీర్ (టెక్నికల్) : అభ్యర్థులు ఇంటర్ లేదా 10+2 పాసై ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, ఇంగ్లిష్ లో 50 శాతం మార్కులు ఉండాలి. ప్రతీ సబ్జెక్టులో 40 శాతం మార్కులు తప్పనిసరి.
- అగ్నివీర్ క్లర్క్: అభ్యర్థులు ఇంటర్ లేదా 10+2 పాసై ఉండాలి.
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (10th class) టెన్త్ పాసై ఉండాలి. ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు పొంది ఉండాలి. వయస్సు 17 ఏళ్లు దాటాలి.
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8th Pass): ఈ పోస్టులకు 8వ తరగతి పాసై ఉండాలి, ప్రతీ సబ్జెక్టులో 33 శాతం మార్కులు సాధించి ఉండాలి. వయస్సు 17 ఏళ్లు దాటాలి.
Jobs updated the day of good news