ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనే అభ్యర్థుల కోసం ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదలకు సిద్దమైంది.. ప్రతి ఆరునెలలకు వెలువడే నోటిఫికేషన్లో భాగంగా.. జనవరి 2026 అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన వారు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9వతేదీలోగా అప్లై చేసుకోవాలి.
అర్హతలు
ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు లేదా బీటెక్ పాసై నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు అయితే 20–24ఏళ్లు, టెక్నికల్, నాన టెక్నికల్ అయితే 20–26 ఏళ్ల వయసు వారు అర్హులు.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తులు నవంబర్ 11నుంచి ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 09లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.550+జీఎస్టీ చెల్లించాలి. పూర్తి వివరాలతో త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. https://afcat.cdac.in/AFCAT/





