హైదరాబాద్‌లోని తెలంగాణ పారా మెడికల్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది. రెండేళ్ల కాలపరిమితితో అందిస్తున్న ఈ కోర్సులకు అర్హత ఇంటర్మీడియట్. అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పారామెడికల్ డిప్లొమా కోర్సులు:
డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్,
డిప్లొమా ఇన్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్,
డిప్లొమా ఇన్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ రేడియో థెరపీ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ డెంటల్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ డెంటల్ హైజీనిస్ట్,
డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ క్యాథ్లాబ్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్,
డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్,
డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ పారామెడిక్ టెక్నీషియన్,
డిప్లొమా ఇన్ మైక్రోసర్జరీ టెక్నీషియన్.
అర్హతలు: రెండేళ్ల కాలపరిమితి గల ఈ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఈ కోర్సులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: బైపీసీ విద్యార్థులు లేకుంటే.. ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సీట్లను ప్రభుత్వ రిజర్వేషన్ల మేరకు ప్రతిభ ఆధారంగా కేటాయిస్తారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 30 వరకు చేసుకోవచ్చు. నవంబర్ 13 నుంచి అభ్యర్థులకు సీట్ల కేటాయింపు, కౌన్సెలింగ్ ఉంటుంది. తరగతలు నవంబర్ 25 నుంచి ప్రారంభం అవుతాయి. పూర్తి వివరాలకు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.