మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీలో (Affiliated to PJTSAU )లలో B.Sc. (Hons.) అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 30వ తేదీ నుంచి అప్లికేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ప్రకటన విడుదల చేశారు. అప్లికేషన్లకు ఆన్ లైన్ వెబ్ సైట్లు https://mjptbcwreis.telangana.gov.in, https://ug.mjptbcwreis.net
లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ప్రకటన విడుదల చేశారు.
2025-26 విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇఎపిసెట్- 2025 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినీలు ఈ డిగ్రీలో చేరేందుకు అర్హులు. వనపర్తి, కరీంనగర్ లో ఉన్న
మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థినీలు ఆగష్టు 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.
EAPCET 2025 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్ ప్రాతిపదికన విద్యార్థినీలకు సీట్లు కేటాయిస్తారు. ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతి, భోజన సదుపాయాలు అందిస్తారు. సీటు సాధించిన విద్యార్థినీలు కాలేజి హాస్టల్ లోఉండాలి. డే స్కాలర్ సదుపాయం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న
విద్యార్థినీ తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక ఆదాయం రూ. 2,00,000 మించని విద్యార్థినీలు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, రిజర్వేషన్లు అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకుంటారు. అప్లికేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 040-23328266 ఫోన్ నెంబర్లో సంప్రదించాలి.





