సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. అక్టోబర్ 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
కోర్సులు
ఎంఎస్సీ (హార్టికల్చర్): ఇందులో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్ క్రాప్స్ స్పెషలైజేషన్ ఉన్నాయి. బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2024 స్కోరు సాధించి ఉండాలి.
పీహెచ్‌డీ (హార్టికల్చర్): ఇందులో 6 సీట్లు ఉన్నాయి. ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్, ఆరోమాటిక్ క్రాప్స్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2024 స్కోరు సాధించి ఉండాలి. వయసు 31 డిసెంబర్ 2024 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: విద్యార్హత మార్కులు, జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ/ ఎస్సీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.750. మిగతా అభ్యర్థులందరికీ రూ.1500 చెల్లించాలి. ఆఫ్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 14లోపు ది రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ, ములుగు, సిద్దిపేట జిల్లా అడ్రస్‌కు పంపాలి. పూర్తి వివరాలకు www.skltshu.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.