HomeJOBSఇంటర్,డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగాలు.. అస్సలు మిస్సవ్వొద్దు

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగాలు.. అస్సలు మిస్సవ్వొద్దు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అనుబంధ సంస్థ అయిన AAICLAS, నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 2026-27 సంవత్సరానికి గాను మొత్తం 220 ఖాళీలను భర్తీ చేసేందుకు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.ఇందులో 158 సెక్యూరిటీ స్క్రీనర్ , 62 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో పనిచేసేందుకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) విమానాశ్రయాల భద్రతా విభాగంలో ఈ నియామకాలను చేపడుతోంది. ఈ ఉద్యోగాలన్నీ మూడేళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు:

  1. సెక్యూరిటీ స్క్రీనర్ (Security Screener)- 158 పోస్టులు
    ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు తప్పనిసరి.

జీతం: మొదటి ఏడాది నెలకు రూ. 30,000 నుంచి ప్రారంభమై, మూడో ఏడాది నాటికి రూ.34,000 వరకు చేరుకుంటుంది.

ముఖ్య తేదీలు: ఆన్‌లైన్ అప్లికేషన్లు మే 18నుంచి ప్రారంభమై జూన్ 8తో ముగుస్తాయి.

  1. అసిస్టెంట్- 62 పోస్టులు
    ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. గ్రాడ్యుయేషన్ లాగే ఇక్కడ కూడా జనరల్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం.

జీతం: నెలకు రూ.21,500 నుంచి రూ. 22,500 వరకు చెల్లిస్తారు.

ముఖ్య తేదీలు: ఈ పోస్టులకు జూన్ 11వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు:
రెండు రకాల పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 ఏళ్లు. అయితే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు,ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు , ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను వారు అకాడమిక్ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటరాక్షన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారు తిరుపతి, తిరుచ్చి, మధురై, పాట్నా, కోల్‌కతా వంటి ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ విధానం:

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aaiclas.aero ద్వారా అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here