కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ సేవా కేంద్రాల్లో పని చేయడానికి 282 సూపర్‌వైజర్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ లేదా ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 31 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు- 282
తెలంగాణ: 11 పోస్టులు
ఆంధ్రప్రదేశ్: 04 పోస్టులు
మధ్యప్రదేశ్ (28), మహారాష్ట్ర (20), ఉత్తరప్రదేశ్ (23) తోపాటు ఇతర రాష్ట్రాల్లో మిగిలిన పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
అభ్యర్థులు కింది విద్యార్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.
1.ఇంటర్ ఉత్తీర్ణత.
- పదవ తరగతితో పాటు 2 ఏళ్ల ఐటీఐ కోర్సు పూర్తి చేయడం.
- టెన్త్ తర్వాత 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి.
గమనిక:
అభ్యర్థులు UIDAI ద్వారా జారీ చేసిన ‘ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికేట్’తప్పనిసరిగా కలిగి ఉండాలి.అభ్యర్థుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం, ఎంపిక విధానం:
ఎంపికైన అభ్యర్థులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన సెమీ-స్కిల్డ్ మ్యాన్‌పవర్ కింద జీతం ఉంటుంది. విద్యార్హతలు, ఆధార్ సర్టిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: జనవరి 31 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలా ?
ఆసక్తి గల అభ్యర్థులు CSC అధికారిక వెబ్‌సైట్ cscspv.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
ముందుగా UIDAI పోర్టల్‌లో పరీక్ష రాసి సర్టిఫికేషన్ పొందాలి.
ఆ తర్వాత ఆధార్ LMS ద్వారా శిక్షణ పూర్తి చేయాలి.
అనంతరం సంబంధిత వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మీ వివరాలను ఎంటర్ చేయాలి.





