టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. దేశ వ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8700 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్, ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పీజీటీ టీచర్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి,
టీజీటీ పోస్టులకు 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ టీచర్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్, డీఈడీ లేదా బీఈడీ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. కనీసం ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 40 ఏళ్లు మించకుండా వయసు ఉండాలి.