Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS835 హెడ్​కానిస్టేబుల్​ పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్

835 హెడ్​కానిస్టేబుల్​ పోస్టులకు ఎస్​ఎస్​సీ నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేష‌న్-2022 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం 835 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 16వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

అర్హత‌: ఇంటర్‌ ఉత్తీర్ణత‌తో పాటు నిర్ధిష్ట శారీర‌క ప్రమాణాలు, ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.18 నుంచి -25 ఏళ్ల మ‌ధ్య వయసు ఉండాలి. క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్‌ అండ్‌ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమంయ 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్​: జనరల్​ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్​ ఫీజు లేదు. ఆన్​లైన్​లో జూన్​ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.ssc.nic.in వెబ్​సైట్ సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!