ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) ఆఫీసర్ స్థాయిలో 647 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్యభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ తదితర స్కేల్–1 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్ తరహా రెండు స్టేజిల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
పోస్టులు: 647
ఐటీ ఆఫీసర్లు 20
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 485
రాజ్‌భాష అధికారి 25
లా ఆఫీసర్ 50
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 7
మార్కెటింగ్ ఆఫీసర్ 60
అర్హతలు: ఐటీ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్‌కి సంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. రాజ్యభాష అధికారికి హిందీ, సంస్కృతం భాషల్లో పీజీతో పాటు ఇంగ్లీష్/ హిందీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లా ఆఫీసర్ పోస్టుకు లా డిగ్రీతో పాటు బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా ఎన్రోలై ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్‌కి మార్కెటింగ్ స్పెషలైజేషన్‌లో రెండేళ్ల ఎంఎఎస్/ ఎంబీఏ/పీజీ డిప్లొమా చేసి ఉండాలి.
వయసు: 1 నవంబర్ 2020 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్‌కు చివరితేది: 23 నవంబర్ 2020
పరీక్ష తేదీలు: ప్రిలిమినరీ–2020 డిసెంబరు 26, 27 తేదీల్లో.. మెయిన్ పరీక్ష-2021 జనవరి 24
వెబ్‌సైట్: www.ibps.in
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
ప్రిలిమినరీ:
ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో వచ్చిన మార్కులను ఫైనల్ మెరిట్లో కలపరు. నోటిఫికేషన్లో పేర్కొన్న లా ఆఫీసర్, రాజ్యభాష అధికారి పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ 150 మార్కులకు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. డ్యూరేషన్120 నిమిషాలు.
ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తం 125 ప్రశ్నలకు గానూ150 మార్కులకు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. డ్యురేషన్ 120 నిమిషాలు ప్రతి అంశానికి 40 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది .
మెయిన్ పరీక్ష:
ప్రిలిమినరీ పరీక్షలో మినిమం కటాఫ్ మార్కులు పొందిన వారిని మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. రాజ్యభాష అధికారి పోస్టుకు నిర్వహించే మెయిన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌లో 45 ప్రశ్నలు, డిస్క్రిప్టివ్‌లో 2 ప్రశ్నలు వస్తాయి. రెండింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలకు 30 నిమిషాల చొప్పున డ్యూరేషన్ ఉంటుంది.
లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశం నుంచి 60 ప్రశ్నలు- వస్తాయి. మొత్తం 60 మార్కులు కేటాయించారు . డ్యూరేషన్ 45 నిమిషాలు. ప్రిలిమినరీ, మెయిన్ ఆబ్జెక్టివ్పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది.
ఇంటర్వ్యూ: మెయిన్‌కు హాజరైన అభ్యర్థులందరినీ ఇంటర్వ్యూకు కూడా పిలుస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం 100 మార్కులు కేటాయించారు. మెయిన్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.
647 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్.. నవంబర్ 23 వరకు ఛాన్స్
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS