బ్యాంకులో ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంకులు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి. ఈమధ్యే ఐబీపీఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగాలకు నియామక ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కలిపి మొత్తం 627 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జూన్ 12 వ తేదీ నుంచి అప్లికేషన్స్ ప్రారంభం అయ్యాయి. అర్హత ఉన్నవారు జులై 2 వరకు బ్యాంకు ఆధారిత వెబ్ సైట్ bankofbaroda.inలో ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ లో 459 సీట్లను కాంట్రాక్టు పద్దతిలో 168 రెగ్యులర్ విధానంలో భర్తీ చేయున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కాంట్రాక్టు పీరియడ్ ఒక ఏడాది పాటు ఉంటుంది. రెగ్యులర్ జాబ్స్ స్పెషలిస్టు కేటగిరీ కిందికి వస్తాయి. కార్పొరేట్ అండ్ ఇన్ స్టిట్యూషనల్ క్రెడిట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ పోస్టుల్లో ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్ 15, క్రెడిట్ అనలిస్ట్ 80, రిలేషన్ షిప్ మేనేజర్ 66, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ 4, చీఫ్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్స్ 3 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు రుసుము:
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులకు రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆన్లైలో చెల్లించాలి.
ఎంపిక విధానం:
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్ మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..సెలక్షన్ ప్రాసెస్ లో ముందు ఆన్ లైన్ టెస్టు ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
అర్హత:
ఫారెక్స్ అక్విజిషన్, రిలేషన్‌షిప్ మేనేజర్:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. సేల్స్ లేదా మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫారెక్స్‌లో సేల్స్/ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో కనీసం ఏడాది పాటు ఎక్స్‌పోజర్‌తో పాటు పబ్లిక్/ప్రైవేట్ / విదేశీ బ్యాంకులలో రెండేండ్ల ఎక్స్‌పీరియన్స్ అవసరం.
క్రెడిట్ అనలిస్ట్:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్, CA పూర్తి చేసి ఉండాలి. క్రెడిట్ అప్రైజల్/ ప్రాసెసింగ్/ ఆపరేషన్స్‌లో ఎక్స్‌పోజర్‌తో పాటు పబ్లిక్/ ప్రైవేట్ / ఫారిన్ బ్యాంక్‌లలో అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుంది.
చీఫ్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్స్:
అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండటం తప్పనిసరి. DISA/CISA సర్టిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆడిట్ కంపెనీలో ఇంటర్నల్ ఆడిట్ & ఇంటర్నల్ కంట్రోల్ విభాగంలో కనీసం 8ఏండ్ల అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు అర్హత, అనుభవం, జీతం, ఇతర కోసం అధికారిక నోటిఫికేషన్ ఓ సారి చెక్ చేసుకోండి.