రాష్ట్రంలో కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో 600 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, పరిపాలన డైరెక్టర్ పరిధిలో ఈ ఖాళీలున్నాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అనుమతించిన 600 పోస్టుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఒక్క నెలలోనే (సెప్టెంబరులో) తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు 3967 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు పోస్టులున్నాయి. కొత్తగా మరో 600 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోస్టుల సంఖ్య మరింత పెరిగినట్లయింది.
ఖాళీగా ఉన్న పోస్టులు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124,
డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌లు 7,
స్టాఫ్‌నర్సులు 272,
గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ 99,
గ్రేడ్-2 ల్యాబ్‌టెక్నీషియన్ 34,
ఏఎన్‌ఎం 54,
రేడియోగ్రాఫర్ 5,
డెంటల్ టెక్నీషియన్ 3,
డెంటల్ హైజనిస్ట్ 1,
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1.