మూడు ప్రభుత్వరంగ కంపెనీలు ఆయా ట్రేడుల్లో 536 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్ రిలీజ్ చేశాయి. ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఎన్టీపీసీ:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ 70 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 70 ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ. 24 వేల స్టైఫండ్ ఇస్తారు.
చివరి తేది: డిసెంబర్ 12
మరిన్ని వివరాలకు www.ntpccareers.net
ఐవోసీఎల్:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. టెక్నికల్ అప్రెంటిస్, నాన్ టెక్నికల్ అప్రెంటిస్(మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్) విభాగాల్లో 436 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్‌కు చివరి తేది: వచ్చే నెల19.
మరిన్ని వివరాలకు www.iocl.com
డీఆర్డీవో:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన థానేలోని డీఆర్డీవో- నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(ఎన్‌ఎంఆర్‌ఎల్) 30 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఏ/ బీకాం ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. కేవలం అకడమిక్ మెరిట్ ప్రకారమే సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్లు ఈమెయిల్ ద్వారా పంపాలి.
15 రోజులలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు www.drdo.gov.in