HomeFeaturedBANK EXAMSఇండియన్‌ బ్యాంక్‌లో 312 స్పెషలిస్ట్‌ ఆఫీసర్​ పోస్టులు

ఇండియన్‌ బ్యాంక్‌లో 312 స్పెషలిస్ట్‌ ఆఫీసర్​ పోస్టులు

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్‌ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. మొత్తం 312 పోస్టులకు ఆన్​లైన్​లో జూన్​ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. పోస్టుల్ని అనుసరించి 23 నుంచి -40 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్​ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జూన్​ 14 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం www.indianbank.net.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!