Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ పాసైతే చాలు.. 25272 కానిస్టేబుల్​ పోస్టులకు నోటిఫికేషన్​

టెన్త్ పాసైతే చాలు.. 25272 కానిస్టేబుల్​ పోస్టులకు నోటిఫికేషన్​


స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ 25,271 కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్​ చేసింది. సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుల్​ పోస్టులు ఇందులో ఉన్నాయి. టెన్త్​ పాసైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 25, 271
బీఎస్​ఎఫ్​ – 7545
సీఐఎస్​ఎఫ్​ – 8464
ఎస్​ఎస్​బీ – 3806
ఐటీబీపీ – 1431
ఏఆర్​ – 3785
ఎస్ఎస్ఎఫ్ – 240


పదోతరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, మెడికల్​ టెస్ట్​ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ కంప్యూటర్‌ బేస్​డ్​ టెస్ట్​లో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 17 జులై
చివరితేది: ఆగస్టు 31
అప్లికేషన్​ ఫీజు చెల్లించడానికి చివరితేది: 2 సెప్టెంబర్‌
సీబీటీ ఎగ్జామ్​ తేది: త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్‌: www.ssc.nic.in

Advertisement
ssc-17-07-2021-1



Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!